ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతాం మంత్రి సీతక్క, ఉపాధి కూలీల వద్దకు వెళ్లి వారి బాధలను తెలుసుకొని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే ఉపాధి కూలీలకు భవిష్యత్తు బంగారం అవుతుందని మంత్రి వివరించారు.




ఆదిలాబాద్ పార్లమెంట్ నిర్మల్ జిల్లా లోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల దగ్గర వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
బలహీనవర్గాల గుండె చప్పుడు విన్న నేత రాహుల్ గాంధీ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ తొలిసారిగా ఆత్రం సుగుణకు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు. భారత దేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని రూపుమాపి కుల వ్యవస్థను, మనుధర్మ శాస్త్రాన్ని, వర్ణ వ్యవస్థను తీసుకువచ్చి మధ్యయుగం నాటి అణిచివేత, అంటరానితనం తీసుకురాబోతున్న సందర్భంగా జరగబోతున్న ఎన్నికలు ఇవి. అందరి హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం. అందరు దీన్ని కాపాడుకోవాలంటే మన రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి కావాలి నరేంద్ర మోదీ పేదల నేత కాదని, కార్పొరేట్ కంపెనీల నాయకుడని మంత్రి సీతక్క విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అభివృద్ధి గురించి అడిగితే, అయోధ్యను చూపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చిన హమీలు కచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు.
పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. పెద్ద పెద్ద బంగ్లాలు, ఫామౌజ్ లు కట్టుకున్న కేసీఆర్ రాష్ట్రంలో పేద ప్రజలకు ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కట్టివ్వలేదని మంత్రి డాక్టర్ సీతక్క అన్నారు.
మన ఇంటి ఆడ బిడ్డ ఆత్రం సుగుణ ని భారీ మెజార్టీ తో గెలిపించాలని ఓట్లర్లను కోరారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
