Monday, February 16, 2026

కారు దిగి హస్తం గూటికి చేరుతున్న గులాబీ తమ్ముళ్లుజుక్కల్ ఎమ్మెల్యే కృషికి ఆకర్షిలవుతున్న ప్రజలు

నిజామాబాద్ బ్యూరో

పార్లమెంట్ ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గం లో భారీ మెజార్టీ సాధించడం కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించడమే లక్ష్యంగా భావిస్తూ ఎమ్మెల్యే, కార్యకర్తలు కృషి చేస్తున్నారు.

శాసనసభ ఎన్నికల సమయంలో జుక్కల్ నియోజకవర్గం లో నువ్వా నేనా అన్న చందంగా కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీలు ఎన్నికల్లో తలపడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యంగా కాంగ్రెస్ పవనాలు వీచి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో ఆ పార్టీ దక్కించుకొని కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకోంంది. స్వల్ప ఆదిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలుపొందిన నాటినుండి ఏనాడు నియోజకవర్గాన్ని ప్రజలను మరవకుండా ప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆనాటి నుండి జుక్కల్ నియోజకవర్గం వెనుకబాటుకు గురైందన్న అపవాదు కూడా నియోజకవర్గ ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు మాత్రం వెనకబాటుకు గత పాలకులె కారణమని వెనుకబాటను రూపుమాపి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని గంటపదంగా చెబుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఉన్న పరిస్థితులు పార్లమెంటు ఎన్నికలకు తారుమారు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. పదేళ్లపాటు అధికారం చలాయించిన 15 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న హనుమంత్ షిండే ఉన్నప్పటికీ నేడు టిఆర్ఎస్ పరిస్థితి నా నాటికి బలహీన పడుతూ వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తీసుకురావడమే తన లక్ష్యంగా భావిస్తూ ఎమ్మెల్యే తీవ్ర కృషి చేస్తున్నారు. కార్యకర్తలను నాయకులను పురమాయించాలని కాకుండా తానే స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి కొన్ని సందర్భాల్లో ఇంటింటి ప్రచారాన్ని కూడా చేపడుతున్నారు. ఎమ్మెల్యే చూపెడుతున్న అంకితభావానికి ఎంతోమంది ఆకర్షితులై ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందడమే కాకుండా కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుందన్న, నమ్మకం బలంగా ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే మాటలు పనితీరు ప్రజలను ఆకర్షిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కూడా తన ఓటు బ్యాంకును పెంచుకుంది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కూడా కచ్చితంగా పెరిగింది. బిఆర్ఎస్ మాత్రం జుక్కల్ నియోజకవర్గంలో సైతం మూడో స్థానానికి పడిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఓట్ల మెజార్టీతో ఆనాటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఓటమి పాలు అయ్యారు. బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బి బి పాటిల్ జుక్కల్ నియోజకవర్గ మదనూరు మండలం సిర్పూర్ గ్రామవాసి కావడం మరోపక్క పాటిల్ సామాజిక వర్గం బలంగా ఉండడం నియోజకవర్గం లో వారి ప్రాబల్యం ఆనాటి నుండి నేటి వరకు కొనసాగుతూ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఎత్తులకు పోయేత్తులేస్తూ ఎమ్మెల్యే మాత్రం వెనకకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారు. గతంలో స్వల్ప ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ వర్గాలు అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఎవరికి వారే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రజలను చైతన్యం పరచడంలో ముందుంటున్నారు.

కాంగ్రెస్ లో భారీ చేరికలు

జుక్కల్ మండలం కౌలాస్ గ్రామం నుండి గ్రామ అధ్యక్షులు గంగా రెడ్డి,అనిత సింగ్,పాకాల వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ గొల్ల హనుమన్లు,ఎంపీటీసీ ఉమాకాంత్, హన్మగౌడ్, బలరాం మరియు నాయకులు, కార్యకర్తలు,మహిళలు మరియు యువకులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మద్నూర్ మండలం చిన్న ఎక్లార గ్రామానికి చెందిన ఇతర పార్టీల నాయకులు,కార్యకర్తలు ఎమ్మేల్యే గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జుక్కల్ మండలం మహ్మదాబాద్ గ్రామంలో మాజీ సర్పంచ్ సాయిలు ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మేల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఈ చేరికలు పార్టీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని ఎమ్మేల్యే తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.

పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని ఈ చేరికల వల్ల కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular