Monday, February 16, 2026

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే ధ్యేయంగా పనిచేయాలి

పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు పనిచేయాలని జుక్కల్ ఎమ్మెల్యే కార్యకర్తలకు సూచించారు. జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నిజాంసాగర్, మహమ్మద్ నగర్ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న దృష్ట్యా కార్యకర్తలు ఐకమత్యంతో ముందుకు వెళుతూ ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలుపొందిన నాలుగున్నరేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ప్రజలకు సేవలను అందించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
సురేష్ షెట్కార్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని..
జుక్కల్ నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ సాధించాలని నాయకులకు దిశానిర్ధేశం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular