Monday, February 16, 2026

దిగువ ఫారంలో ఇంటింటా ప్రచారం

నిజామాబాద్ జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పోతంగల్ మండలం హెగ్ డ్దోలి గ్రామపంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేశారు. జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి మన ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కార్యకర్తలు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటుందని, రాబోయే రోజుల్లో పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని కాంగ్రెస్ బూత్ కన్వీనర్లు ప్రజలకు వివరించారు. ఇప్పటికే కొంతమంది ఇల్లు నిర్మించుకుని బిల్లులు పొందలేకపోయారని, అటువంటి వారికి ఎన్నికల కూడా అనంతరం బిల్లులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మరి కొంతమందికి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇనుకుర్తి సురేందర్, ఆరుగొండ బస్వంత్ పటేల్, సుబ్బారావు, ఇనుకుర్తి శ్రీనివాసరావు, అభిషేక్, రాజారావు, నల్లూరి ప్రభాకర్, ఇనుకుర్తి బబ్లు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular