పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ పథకాలు అన్నిటిని అమలు చేసి తీరుతామన్నారు. ఆగస్టు 15 లోపు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని, ప్రజలు ఆలోచన చేసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని మంత్రి కోరారు.
ములుగు నియోజకవర్గ కొత్తగూడ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ పోరిక బలం నాయక్ గెలుపు లక్ష్యంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు మరియు ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్.ఈ కార్యక్రమంలో ములుగు డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్, ఎల్ డి ఎం కోఆర్డినేటర్ డాక్టర్ పులి అనిల్ కుమార్,మహబూబాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నూనవత్ రాధ తదితరులు ఉన్నారు.


