ముక్తకంఠంతో కాంగ్రెస్ మద్దతు తెలిపిన ముదిరాజులు






కామారెడ్డి పట్టణంలోని ముదిరాజ్ సామాజిక వర్గం వారందరూ కాంగ్రెస్ పార్టీకి ముక్తకంఠంతో మద్దతిస్తామని ఆత్మీయ సమ్మేళనం లో కాంగ్రెస్ నాయకులకు మాట ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తూ సంక్షేమ పథకాలు అందించడంతోపాటు వారి ఆర్థిక సామాజిక పరిస్థితులు మెరుగు పరిచే ప్రయత్నాలు చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, తనను జహీరాబాద్ ఎంపీగా గెలిపిస్తే ముదిరాజుల అభివృద్ధికి పార్లమెంట్లో గళం విప్పుతానని కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్ కార్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ముదిరాజ్ సంఘ భవనంలో ముదిరాజ్ సంఘ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం లో ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ , జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ . రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సురేష్ శెట్కార్ కి మద్దతూ ప్రకటించారు.
