Monday, February 16, 2026

ఉపాధి కూలీలకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి

ఉపాధి కూలీల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, కూలీలకు శ్రమకు తగ్గ ఫలితం లభించడం లేదని, కూలీలు పనులు నిర్వహించే ప్రదేశాల్లో తాగునీటి వసతి, విశ్రాంతి తీసుకునేందుకు నీడను ఏర్పాటు చేయాలని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అధికారులను కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయితే ఉపాధి కూలీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఉపాధి కూలీలకు 400 రూపాయల కూలి చెల్లించే వీలు కల్పిస్తామన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం అని, జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుండి జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న సురేష్ షేట్ కార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఏనుగు రవీందర్ రెడ్డి కూలీల పిలుపునిచ్చారు.
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బైరాపూర్, సాంబాపూర్, మల్లాపూర్,బీర్కూర్ గ్రామాలల్లో ఉపాధి హామీ కూలీలని కల్సి వారి బాధ క సాధకాలను అడిగి తెలుసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular