Monday, February 16, 2026

కామారెడ్డిలో బిఆర్ఎస్ కు షాక్

మాచారెడ్డి మండలంలో బిఆర్ ఎస్ ఖాళీ

కామారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మాచారెడ్డి ఉమ్మడి మండలం నుండి సర్పంచులు ఎంపీటీసీలు అన్ని గ్రామాల నుండి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు (సురేష్,) తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

కామారెడ్డి వైస్ ఎంపీపీ ఉరుదండ నరేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

రాజంపేట జెడ్ పి టి సి హనుమాన్లు కాంగ్రెస్ పార్టీలో చేరిక

కామారెడ్డి పట్టణంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మ ద్ అలీ షబ్బీర్ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్, ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్ అలీ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

గతంలో కెసిఆర్ , కేటిఆర్, కాంగ్రెస్ పార్టీకి షబ్బీర్ అలి కి జెండా మోసే వాడు ఉండడు అని అహంకారపు
మాటలు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి జెండా పట్టేవాడు లేడు మాచారెడ్డి లో అహంకారపు మాటలు దేవుడు కూడా భరించడు. కెసిఆర్ పర్యటన తర్వాత భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి.
అందరూ కష్టపడి జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ ఓట్లు సాధించేట్లు చూడాలి.కాంగ్రెస్ పార్టీ నీ ప్రజలు నమ్మారు పట్టం కట్టారు.వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల్లో ఐదు అమలు చేశాం.కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పార్టీ ఫిరాయింపులపై ఇష్టం లేదు.కానీ కెసిఆర్ మాటిమాటికి మీ ప్రభుత్వాన్ని కూలగొడతామని రెచ్చ గొట్టే ప్రసంగాలు చేస్తూ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ నాయకులను చేర్చుకోవడం జరుగుతుంది.రైతులకు నష్టపరిహారం బిఆర్ఎస్ హయంలో ఎక్కడ ఇవ్వలేదు.
పార్లమెంటు ఎన్నికల తరువాత బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది.మళ్ళీ ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి సురేష్ శెట్కర్ ను ఎంపిగా గెలిపించండి.పంట నష్ట పరిహారం ఎన్నికలు అయ్యాక రైతులకు ఇస్తాము.
గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశాను. బీబీ పాటిల్ తన పది సంవత్సరాల హయాంలో ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదు .
ఎన్నో నిధులు తిరిగి కేంద్రానికి వెళ్లిపోయాయని జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఆవేదన వ్యక్తం చేశారు.బిబిపాటిల్ కు తన వ్యపారల మీదఉన్న మోజు ప్రజల సమస్యలపై లేదు .
బీబీ పాటిల్ అంటే బిజినెస్ పాటిల్ తన వ్యాపారాలను కాపాడుకోవడానికి మాత్రమే ఎంపీగా కావాలను కుంటున్నాడు. ప్రజల కష్ట సుఖాలను తెలిసిన ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న అభివృద్ధి నాయకుడిని పార్టీని ఎంపిక చేసుకోవాలని అన్నారు.
ఈసారి అవకాశం ఇవ్వండి మీ సమస్యలన్నీ దగ్గరుండి తీరుస్తాను.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular