నిజామాబాద్ బ్యూరో



ప్రజా సేవకుడు, మచ్చలేని నాయకుడు జీవన్ రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నాయకులు గెలుపునిచ్చారు.సిపిఎం పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి 45 సంవత్సరాలుగా నిత్యం ప్రజా సేవలో ఉండటంతో పాటు ఎటువంటి మచ్చ లేకుండా ప్రజల మనిషిగా పనిచేస్తూ నిస్వార్థ నాయకుడిగా ఉన్నారని ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచన చేసి వేస్తే ఐదేళ్లపాటు జీవన్ రెడ్డి మనకు సేవలు అందించడంతో పాటు పార్లమెంట్లో నిజాంబాద్ సమస్యలపై గళం విప్పుతారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బిజెపి పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న ధర్మపురి అరవింద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని పసుపు బోర్డు ఏర్పాటు కానీ, రైతులకు గిట్టుబాటు ధరను కల్పించడంలో కానీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపించడంలో కానీ విఫలమయ్యారని ప్రజల్లో నిత్యం మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇస్తూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని . దేశంలో కూడా గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ దేశంలో ఉన్న ప్రజాధనాన్ని కొద్దిమంది ధనవంతులకు అప్పగిస్తూ ప్రజా సమస్యలను విస్మరించారని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మర్చిపోయారని ధరలను అదుపు చేయకుండా ప్రజల జీవన ప్రమాణాలను పడిపోతున్నాయని వీటికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయకుండా రామాలయం నిర్మాణం, హిందూ ముస్లింల మధ్య తగువులను తెరమీద తెచ్చి రాజకీయ ప్రయోజనాలను పొందటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బిజెపిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు వై గంగాధర్, సుజాత, జంగం గంగాధర్, నన్నే సాబ్,, కొండ గంగాధర్ మరియు కటారి రాములు, నరసయ్య, అనసూయ, నాయక్ వాడి శ్రీనివాస్, హైమద్, సూరి తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశవేణు, నరాల రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.
