Monday, February 16, 2026

రైతులు పండించిన పంటలకు 500 బోనస్ చెల్లిస్తాం

నిజామాబాద్ బ్యూరో

మచ్చలేని రైతు నాయకుడు జీవన్ అన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి

69 లక్షల మంది రైతులకు రైతుబంధు చెల్లించాం

పసుపు బోర్డు, చక్కెర ఫ్యాక్టరీలు ఏర్పాటు కాంగ్రెస్ తోనే సాధ్యం

నిజాం షుగర్ ఫ్యాక్టరీ బ్యాంకు బకాయి 42 కోట్లు చెల్లించాం

ఆగస్టు 15 లోపు పంట రుణాలు మాఫీ చేస్తాం

నల్ల చట్టాలకు రైతులు పోరాటం చేసి కేంద్రం మెడలు వంచారు

ఆర్మూర్ మున్సిపల్ భవనానికి 16 కోట్ల నిధులు మంజూరు చేస్తా

దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తూ ఓట్లు అడుక్కుంటున్నారు

అమరవీరుల స్థూపం వద్దకు రావాలని సవాలు విసిరిన ముఖ్యమంత్రి

భారతీయ జనతా పార్టీ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తూ ఓట్లు బిచ్చం ఎత్తుకుంటున్నారని, పదేళ్లపాటు కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ ప్రాంతానికి ఏమాత్రం అభివృద్ధికి సహకారం అందించలేదని మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ప్రధాని మోదీ అబద్ధాలు ఆడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి తన సందేశాన్ని అందించారు. ఆర్మూర్ ప్రాంత రైతులు ఎంతో చైతన్యవంతులని, అంకాపూర్ రైతులు ఆదర్శప్రాయులని రాష్ట్రంలోనే ఏ పంటలను సాగు చేయాలో ఎలా లాభాలను అర్జించాలో దిశా నిర్దేశం చేసే ఈ ప్రాంత రైతాంగ సమస్యలను తాను పరిష్కరించి తీరుతానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని ఐదేళ్లుగా భారతీయ జనతా పార్టీ, ఈ ప్రాంత ఎంపీ అరవింద్ రైతులను మోసం చేశారని మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంత రైతాంగం అభివృద్ధి కోసం పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు, చక్కెర కర్మాగారాలను పున ప్రారంభిస్తామని, ఇప్పటికే సభా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చక్కెర కర్మాగారాలు బ్యాంకులో ఉన్న అప్పులను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా 42 కోట్ల రూపాయలు ఇప్పటికే మా ప్రభుత్వం చెల్లించిందని రైతులకు వివరించారు. రైతులు పండించే పంటలకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ చెల్లించి పంటల కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మచ్చలేని నీతి నిజాయితీకి మారుపేరుగా కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న రేవంతన్నను నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని పిలుపునిచ్చారు. 2014లో టిఆర్ఎస్ కు, 2019లో బిజెపికి అవకాశం ఇచ్చారు. ఒక్క అవకాశం జీవన్ అన్నకు ఇస్తే ఈ ప్రాంత అభివృద్ధిని తాను చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్ల చట్టాలను అమలు చేసి రైతులపై బీజేపీ ప్రభుత్వం రుద్దే ప్రయత్నం చేసిందని, హర్యానా పంజాబ్ లాంటి రాష్ట్రాల రైతులు ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమాన్ని కొనసాగించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నల్ల చట్టాలను విరమించుకొనేటట్లు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. అలాంటి ఉద్యమ చైతన్యవంతులైన నిజామాబాద్ ప్రాంత రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో చైతన్యవంతులై స్వయానా వ్యవసాయం చేపట్టే, రైతు కష్టం తెలిసిన జీవనన్నను గెలిపిస్తే రాబోయే రోజుల్లో పార్లమెంటులో ఈ ప్రాంత రైతుల గళం విప్పే అవకాశాలు కలుగుతాయన్నారు. మే 9 లోపు రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బు వేస్తామని మాటిచ్చానని ఇప్పటికే రైతులందరికీ రైతుబంధు డబ్బులు వేయడం జరిగిందని, డబ్బులు వేస్తే కెసిఆర్ అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తానని సవాలు విసిరారని ఆ సవాలుకు ప్రతి సవాలుగా తమ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు వేశామని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థూపం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాయాలని ముఖ్యమంత్రి సవాలు విసిరారు. రుణమాఫీ చేసి తీరుతామని, హరీష్ రావు రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని సవాలు విసిరారు, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని సిద్దలగుట్టపై ఒట్టు పెట్టుకొని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాజీనామా లేఖను హరీష్ రావు సిద్ధంగా ఉంచుకోవాలని ఆగస్టు 15 రోజున తెలంగాణ రైతులకు స్వతంత్రం వస్తుందని, సిద్దిపేటకు పట్టిన దరిద్రం వదిలించే ప్రయత్నంలో ఉన్నామన్నారు. పదేళ్లపాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం ఖాయమని, ప్రజలు తమ పార్టీ వైపు ఉంటే ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎంతటి కష్టానికైనా తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆయన వెంట నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular