Monday, February 16, 2026

బీజేపీ మళ్ళీ గెలిస్తే ఇక ఎన్నికలు ఉండవ్

హైదరాబాద్ హీరో

ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్

అసమానతలు పెరిగిపోతున్నాయి

జస్టిస్ చంద్ర కుమార్

దేశంలో మరోసారి బిజెపి అధికారంలోకి వస్తే ఇక ఎన్నికలు ఉండబోవని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎస్సార్ కన్వెన్షన్ హాల్ నందు డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్ అధ్యక్షతన ప్రస్తుత ఎన్నికలు – మన బాధ్యత అను అంశంపై జరిగిన సెమినార్ ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడిందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతులను నాశనం చేయటం ప్రజాస్వామ్యము మరియు రాజ్యాంగ అంశాలను దుర్వినియోగం చేయటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజల చేత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలను నిస్సిగుగా కూల్చిన ఘనత ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో బిజెపి పార్టీకి ఉందన్నారు. పిఎం కేర్స్ లోని అవినీతిని ప్రశ్నించడానికి వీలు లేకుండా సమాచార హక్కు చట్టం నుండి తొలగించారన్నారు. ఇంతవరకు విరాళా రూపంలో వచ్చిన 5416 కోట్ల రూపాయలను ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా తెలియ చెప్పలేదన్నారు. 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అయినా మోడీ మాటలు నమ్మి జనం ఓట్లు వేసిన తర్వాత నట్టేట ముంచారన్నారు. పెద్ద నోట్ల రద్దు, రాఫెల్ కుంభకోణం, కరోనా సమయంలో పడ్డ ఇబ్బందులు, ఉద్దీపనల పేరుతో విడుదల చేసిన తొంబై లక్షల కోట్ల రూపాయలు, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, పడిపోయిన రూపాయి విలువ, గుర్తుంచుకొని ఓటు వేయాలన్నారు. బిజెపికి ఓటు వేస్తే రాబోయే రోజుల్లో సభలు సెమినార్లు పెట్టుకునే అవకాశం కూడా ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపిని ఓడించాలి అంటే మరి ఎవరిని గెలిపించాలని అంశం ముందుకు వస్తుందని నేను ఎవరిని గెలిపించాలో మీకు చెప్పను కానీ మాక్స్ ఫిక్సింగ్ చేసుకునే వాళ్ళని మాత్రం గెలిపించవద్దని ఆయన తెలియజేశారు.

అసమానతలు పెరిగిపోతున్నాయి

రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ దేశంలో అసమానతలు గతంలో కంటే చాలా పెరిగిపోయాయి అన్నారు. చాలా కొద్దిమంది చేతుల్లో కొన్ని వేల బిలియన్ డాలర్లు నలుగుతున్నాయని, పేదవాళ్లు మాత్రం ఇంకా దారిద్ర రేఖ కు దిగుగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకపక్క నరేంద్ర మోడీ దేశంలో పేదరికం లేదంటూనే 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారని ఇందులో ఏ మాట నమ్మాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. మోడీ దేశ ప్రధానిగా వైఫల్యం చెందటం ఆయన యొక్క కార్పొరేట్ మిత్రుల ఆకాంక్షలను తీర్చడానికి వారిని సంతృప్తి పరచడానికి మాత్రమే కృషి చేస్తున్నారని ఆయన విమర్శించారు. రైతుల ఆత్మహత్యల గురించి మోడీ ఒక్కసారి కూడా ఆలోచించలేదు అన్నారు. రైతు చట్టాలను తీసుకువచ్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించారన్నారు. స్వామినాథన్ కమిషన్ ని ఎందుకు అమలు చేయలేదు చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రిపై ఉందన్నారు.అవినీతిలో బిజెపి కూరుకుపోయిందని సమాచార హక్కు చట్టాన్ని, లోక్ పాల్ మరియు లోకాయుక్త చట్టాలను, బలహీనపరచిందన్నారు. ఎన్నికల బాండ్ విషయంలో జరిగిన అవినీతి గురించి చెప్పనవసరం లేదన్నారు. ఎలక్ట్రోలార్ బాండ్స్ ద్వారా బిజెపి సింహ భాగం నిధులను సమకూర్చుకుందున్నారు.. భారత్ మాల ప్రాజెక్టులో గతంలో ఒక కిలోమీటర్కు 18.20 కోట్లుగా నిర్ణయిస్తే అది 20050 కోట్లకు చేరిందన్నారు. ఈ లెక్కన చూసుకుంటే 7.5 లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు. మోడీ తన మిత్రుల కోసం రాఫెల్ వ్యవహారాన్ని కూడా అటకెక్కించారన్నారు . యూపీఏ 2 ప్రభుత్వంలో ఒప్పుకున్న ధర కంటే దాదాపు 41% ఎక్కువగా పెట్టి రిలయన్స్ కంపెనీ చేత రాఫెల్ విమానాలను కొనుగోలు చేశారన్నారు. బీజేపీ కి గతంలో వచ్చిన సీట్ల కంటే సగం సీట్లు కూడా ఇప్పుడు ఎన్నికలలో వచ్చే అవకాశం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామిక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇలియాస్, ప్రముఖ పిల్లల వైద్యులు వై నాగమణి , టిపిటిఎఫ్ నాయకులు ఎస్ విజయ్, యుటిఎఫ్ నాయకులు నాగమల్లేశ్వరరావు , సాదిక్ అహ్మద్, జైనుల్ పాషా, దేవి రెడ్డి విజయ్, కాసిం, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular