తొర్రూరు మండల కేంద్రంలో నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి , శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి తో కలసి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డా కడియం కావ్య రోడ్ షోలో పాల్గొన్నారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.




తొర్రూరు సెంటర్ లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రెడ్డి కి ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య కి భారీ గజ మాలతో స్వాగతం పలికిన ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి అభిమానులు.
భారతదేశానికి బీజేపీ అతి పెద్ద ప్రమాదకారి.దేశాన్ని రక్షించుకోవాలంటే ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలనీ వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ప్రజలకు పిలుపునిచ్చారు.బీజేపీ పార్టీ కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోంది.
నేను ఈ స్థానంలో ఉన్నాను అంటే దానికి కారణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు.విద్వేషాలు ఉన్న రాజ్యంలో ప్రేమను పెంచాలని చెప్పిన గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ.రాహుల్ గాంధీ పాలన దేశానికి అవసరం.నరేంద్ర మోడీ ఆకృత్యాలు మనం చూస్తున్నాం. బీజేపీకి ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, దళితులు, మహిళలు అంటే గిట్టదు.
రాజ్యాంగం అంటే నరేంద్ర మోడీ అయ్య జాగిరా.
మన పిల్లలు చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలి అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి.
6 గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను పూర్తిచేసుకుని 500 కే గ్యాస్, ఉచిత విద్యుత్. అందిస్తున్నాము. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నాం.
నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని యువతను మోసం చేశారు.
కాంగ్రెస్ పార్టీ చేతల పార్టీ. బీఆర్ఎస్ బిజెపిలు కోతల పార్టీలు. కేంద్ర బీజేపీ విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు. ప్రజలు ప్రశ్నించాలి.
బీఆర్ఎస్ – బిజెపిలు తోడుదొంగలు.
వర్ధన్నపేటలో చెల్లని రూపాయి వరంగల్ లో చెల్లుతుందా.
రాహుల్ గాంధీ ఐదు న్యాయాలతో మన ముందుకు వస్తున్నారు.నరేంద్ర మోడీకి మళ్లీ అవకాశం ఇస్తే మన బ్రతుకులు చీకటిమయం అవుతాయి.కాంగ్రెస్ పార్టీ యువతకు, మహిళలకు పెద్ద పీట వేస్తోంది.మీ గొంతుకగా ప్రజల సమస్యలకై పోరాడుతా.మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి కడియం కావ్య ను భారీ మెజార్టీతో గెలిపించాలి.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా వారి అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నారని నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ అన్నారు.
గత ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్లే పాలకుర్తి అభివృద్ధికి నోచుకోలేదు.బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసుగు చెంది తగిన బుద్ధి చెప్పారు.
బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు.
బీజేపీ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదు.
రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంది.కార్యకర్తలంతా కొత్త పాత తేడా లేకుండా ఐక్యంగా ఉండి పార్టీని బలోపేతం చేయాలన్నారు.బీజేపీ రైతులకు అన్యాయం చేసింది.
మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 వ తేది లోపు రైతులకు 2 లక్షల ఋణ మాఫీ చేస్తారు.కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి బ్రమ్మండాగా అభివృద్ధి చెందుతుంది.రిజర్వేషన్లు రద్దుకు బీజేపీ కుట్రలు చేస్తోంది.బీజేపీ కుట్రలను అడ్డుకోవాలంటే కడియం కావ్య చేతి ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు వేసే ప్రతి ఓటు దేశ తలరాతను మారుస్తుంది.భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసమే ఈ ఎన్నికలు.
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ప్రజల మరిన్ని కష్టాలు తప్పవనీ ఎమ్మెల్యే అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల్లో 5 గ్యారెంటీ లను అమలు చేశారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది.
కావ్య ని గెలిపిస్తే మన ప్రాంతా అభివృద్ధికి అధిక నిధులు వస్తాయి.గతంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే… మళ్ళీ ఇప్పుడు చెయ్య బోయోధి కాంగ్రెస్ ప్రభుత్వంమే.
బీజేపీ రాక్షస పాలన నుండి దేశాన్ని కాపాడుకోవాలి.
రాజ్యాంగన్ని రద్దు చేస్తే మన పిల్లల భవిష్యత్ కష్టాల్లో పడుతుంది.బిజెపి దేవుడు పేరుతో రాజకీయం చేస్తోంది.రాముడు అందరికి దేవుడే.బీజేపీ పెదాల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పి 15 పైసలు వెయ్యలేదు.కడియం కావ్య ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఈవీఎంలోని రెండో నెంబర్ లో గల డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బ్లాక్ అద్యక్షులు, వివిధ మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మహిళా నాయకులు, యూత్ మరియు సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
