Monday, February 16, 2026

నిజామాబాదును స్మార్ట్ సిటీ చేస్తా

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాంబాద్ పట్టణంలో రోడ్ షో తో ప్రజలకు వివాదం చేస్తూ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో స్మార్ట్ సిటీగా చేస్తానని, నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ అన్నను గెలిపిస్తే జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో మహిళ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పదేళ్లపాటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి ఐదేళ్లపాటు నిజాంబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ నుండి ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థిని ఆశీర్వదిస్తే నిజాంబాద్ జిల్లా ప్రజలకు అన్ని రకాల సేవలను అందిస్తామన్నారు. బిజెపి దేవుడి పేరుతో ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తుందని, దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో మచ్చలేని తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతూ స్వయానా వ్యవసాయం చేస్తూ రైతుల కష్టసుఖాలు తెలిసిన జీవనన్నా కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ముఖ్యమంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, తహర్ బిన్ హాంధన్, గడుపు గంగాధర్, నరాల రత్నాకర్, ధర్మపురి సంజయ్, కేశవ వేణు, నిజాంబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అనిల్, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్, వినయ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular