Monday, February 16, 2026

రైస్ మిల్లర్లు వడ్ల కటింగ్ చేస్తే ఊరుకునేది లేదు సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

హైదరాబాద్ హీరో

దహెగాం : మండలంలోని లగ్గాం మరియు ఒడ్డుగూడ గ్రామాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని రైతులు ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా వడ్లు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, రైస్ మిల్లర్లు వడ్ల కటింగ్ చేస్తామంటే ఒప్పుకునే సమస్య లేదని హెచ్చరించారు.
రైతులందరూ సంఘటితంగా ఉండి అప్రమత్తంగా వ్యవహరించి వడ్ల కటింగ్ నుంచి విముక్తి పొందాలని పిలుపునిచ్చారు.సిర్పూర్ శాసన సభ్యులు కలెక్టర్ తో మాట్లాడి వడ్ల కటింగ్ విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular