జుక్కల్ నియోజకవర్గం పలు గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆధ్వర్యంలో చేరికలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే ధ్యేయంగా ఎమ్మెల్యే శ్రమిస్తున్నారు. జుక్క ల్ నియోజకవర్గంలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోకుండా ఎమ్మెల్యే పార్టీ అభివృద్ధి కృషి చేస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గం లోని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.మండలం పెద్ద గుల్ల గ్రామ సొసైటీ డైరెక్టర్ విట్టల్ పటేల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు ఖండెబల్లూర్ గ్రామ అధ్యక్షులు రాజు మరియు రాంచందర్,కృష్ణ ఆధ్వర్యంలో గ్రామ యువకులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

