2006 సంవత్సరంలో పేదవారికి ఉపాధి కల్పించేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్, కోఆర్డినేటర్ కాసుల బాలరాజు అన్నారు. గురువారం బిచ్కుంద మండల కేంద్రంలోని కమ్మరి చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి వెళ్లి ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దినసరి కూలీ 400 రూపాయలకు పెంచుతామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయని, ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.



