Monday, February 16, 2026

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అని, ఉపాధి హామీ కూలీలకు శ్రమకు తగ్గ ఫలితం అందడం లేదని, రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కూలీలకు 400 రూపాయలు చెల్లించే విధంగా రూపకల్పన పార్టీ చేస్తుందనీ నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు.మానాల గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి టీ.జీవన్ రెడ్డి ని గెలిపించాలని మానాల గ్రామం దెగవత్ తండ, వీరున్ తాండలలో ఉపాధి హామీ కూలీలతో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడి వారికి ఎగర ఒక నిబంధనలు అడిగి తెలుసుకున్నారు. మానాల గ్రామంలోని ముదిరాజ్ మరియు మున్నూరు కాపు సంఘాల సభ్యులతో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి జీవన్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular