దేశంలో పనులు దొరక్క గతంలో ఎంతోమంది వలస జీవనాన్ని గడిపేవారని అటువంటి కుటుంబాలను ఆదుకోవాలన్న దశలోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిందని మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ కూలీలు పనులు జరిపే ప్రదేశాల్లో తాగునీరు, నీడ లాంటి, ప్రాథమిక వైద్యం కోసం వైద్య కిట్లను ఏర్పాటు చేయాలని ఉపాధి సిబ్బందిని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి కూలీల రేటును పెంచుతామని ఉపాధి కూలీలకు ఏనుగు రవీందర్ రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు అందించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రకటించిన ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు. మహిళల అభ్యున్నతికి ఆనాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కృషి చేసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఉపాధి కూలీలను కోరారు.
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడిచరళ్ల, కోటగిరి గ్రామాలల్లో ఉపాధి హామీ కూలీలని కల్సి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ ని అత్యధిక మేజార్టీతో గేలిపించాలని రవీందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కోటగిరి హరి జన వాడలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొల్లూరు కిషోర్, సలీం, పోలేపల్లి శ్రీనివాసరావు, బర్ల మధు, గంగాధర్ దేశాయ్, కొత్తపల్లి విండో అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, కోటగిరి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్, ఎంపీటీసీ కొట్టం మనోహర్, బాబీ సెట్, వట్టి కొండ సాయి బాబా, తరుణ్, దత్తు, రాజు, గంగారం, సాయిలు, పోతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.



