Monday, February 16, 2026

శ్రీనగర్ లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వర్ని మండలం శ్రీనగర్ గ్రామంలో ఎంపీపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక ఓట్లు వేస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని ఓటర్లకు వివరించారు.
బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపు కోసం వర్ని మండల ఎంపీపీ మేక వీర్రాజు, శ్రీనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ పథకాలు, మహిళలకు ఉచిత బస్సు, మహాలక్ష్మి 5 0 0 రూపాయలకే గ్యాస్, పదిలక్షల ఆరోగ్యశ్రీ ఉచితం, గృహ జ్యోతి 200 లా యూనిట్ల ఉచిత విద్యుత్, శ్రీనగర్ గ్రామంలో,106 & 108, బూత్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular