పార్లమెంటు ఎన్నికల సమయం ముంచుకొస్తుండడంతో జుక్కల్ నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సుడి గాలి పర్యటనలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజార్టీ ఓట్లు సాధించి తీరడం, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే తమ లక్ష్యంగా భావిస్తూ ఎమ్మెల్యే రాజకీయ ఎత్తుగడలకు పై ఎత్తుగడలు వేస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలంలోని బుర్నాపూర్ మరియు అన్నారం గ్రామాలలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలు రాహుల్ గాంధీ ప్రకటించిన ఐదు గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు 6 గ్యారంటీల్లో ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరామని ఎన్నికల కోడ్ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తొలగించే కుట్రలు చేస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షించి ఉన్న రిజర్వేషన్లను పెంచుతుందని దేశ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరించారు.
బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి సచ్చిన పీనుగలా మారిందని.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిగా భూస్థాపితం అవుతుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదల పక్షాన నిలిచి,అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని,పేదల సంక్షేమం, అభివృద్దే కాంగ్రెస్ పార్టీ అజెండా అని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను దాదాపుగా అమలు చేసిందని..
ఆగష్టు 15 తారీఖు లోపు రైతులకు రెండు లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు.తెలంగాణ సెంటిమెంట్ తో బీఆర్ఎస్ పార్టీ,దేవుడు మతం పేరుతో బీజేపీ పార్టీ ఓట్లు అడుక్కుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసిన అభివృద్ది గురించి చెప్పి ఓట్లు అడుగుతుందని అన్నారు.
ప్రజలు చైతన్యవంతులు అయ్యారు అని సెంటిమెంట్ రాజకీయాలకు కాలం చెల్లిందని.ప్రజలు విజ్ఞతతో ఆలోచించి తమకు ఉపాధి కల్పించి అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు.దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కి విపరీతమైన ప్రజాదారణ పెరుగుతున్నదని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.మనమంతా సురేష్ షెట్కార్ కి ఓట్లు వేసి ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుండి నిధులు సేకరించేందుకు వీలు కలుగుతుందని, మన ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ఓటర్లకు వివరించారు.
అనంతరం బుర్నాపూర్ గ్రామంలో తాజా మాజీ సర్పంచ్,సొసైటీ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బుర్నాపూర్ గ్రామంలో ఎస్సీ వార్డ్ లో పర్యటించారు.
అన్నారం గ్రామంలో మాజీ సర్పంచ్ గంగారాం, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.







