Monday, February 16, 2026

తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ కి మద్దతుగా రుద్రూరు మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి.
ప్రచారం లో పాల్గొన్న జెడ్పీటీసీ నారొజి గంగారం,ఎంపీపీ శ్రీమతి సుజాత నాగేందర్, మండల పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, గ్రామ అధ్యక్షులు గంగారం,రైతు బంధు అధ్యక్షులు సంగయ్య,సొసైటీ మాజీ చైర్మన్ పత్తి రాము,వైస్ ఎంపీపీ సాయిలు,పట్టేపు రాములు,నాగేందర్, కోడె శంకర్,షేక్ శుభాని,మాజీ ఉప సర్పంచ్ కలీం,మైనారిటీ గ్రామ అధ్యక్షులు జమిల్,నక్క సాయిలు,స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

కేసీఆర్ పాలనలో పది సంవత్సరాలు బంగారం లాగ ఉన్న తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ 5 నెలల పాలనలోనే దారి తప్పింది. మళ్ళీ పది సంవత్సరాలు వెనుకకు పోయింది.
రైతుబంధు రావడం లేదు, కరంటు కోతలు మొదలయ్యాయి, ధాన్యం కొనుగోలు లేదు.తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వచ్చి అయిదు నెలలు అయింది, హామీలు మాత్రం అమలు కావడం లేదు.
డిసెంబర్ 9న అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మరి ఎవరికైనా వచ్చిందా అని రైతన్నలను అడుగుతున్నా.
రైతుబంధు ఎకరాకు రూ. 15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్,18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇయ్యలేదు.అదేవిధంగా ఆసరా పెన్షన్ రూ. 4000 కు పెంచుతామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 ఇస్తామన్నారు. 24 గంటల కరంటు ఇస్తామన్నారు.
సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ ఇస్తాం, 200 యూనిట్ల వరకు కరంటు ఫ్రి అన్నారు. ఏవి లేవు.
స్కూళ్ళు‌, కాలేజీ లకు వెళ్ళుతున్న విద్యార్ధినులకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు.
కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం కింద లక్షా నూటపదహార్లతో పాటుగా తులం బంగారం ఇస్తామన్నారు, ఇప్పటి వరకు లేదు.అబద్ధాల హామీలతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను ముంచారు. మీరందరు ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి.
కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు పేదలకు ఠంచనుగా పెన్షన్లు వచ్చేవి. రైతుబంధు డబ్బులు సమయానికి రైతుల బ్యాంకు అకౌంట్లలో వేసేవారు. పెళ్ళైన రెండు నెలలోనే కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం లక్షా నూటపదహార్లు అందేవి. 24 గంటల విద్యుత్ సరఫరా అయ్యేది. ఏనాడు పంటలు ఎండిపోలేదు.
బాన్సువాడ నియోజకవర్గంలో పదివేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారు.
బిఆర్ యస్ ప్రభుత్వంలో పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గానికి 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళను మంజూరు చేయించి పేదలకు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, ఒక్కటి కూడా ఇయ్యలేదు.పదేళ్ళు ఎంపీ గా పనిచేసి ఇప్పుడు బిజెపి అభ్యర్థిగా ఉన్న బిబి పాటిల్ బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు తేలేదు.అంతకు ముందు ఐదేళ్లు ఎంపీగా గా పనిచేసిన కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షెట్కార్ కూడా ఏం పని చేయలేదు.
పదిహేను సంవత్సరాలు ఏ పని చేయని వాళ్ళకు మనం ఎందుకు ఓటు వెయ్యాలి.
బిఆర్ యస్ పార్టీకి 12 సీట్లు వస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసేది కేసీఆర్ .గాలి అనీల్ కుమార్ బిసి బిడ్డ. అందరం కలిసి బలహీన వర్గాల బిడ్డను బారీ మెజారిటీతో గెలిపించాలి. అప్పుడే ఈ ప్రాంతంలోని యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.

అందరం కారు గుర్తుపై ఓటు వేసి పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ ని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular