భారతదేశ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఆదర్శంగా నిలబెట్టిన ప్రధానమంత్రి మోడీని మూడోసారి ప్రధానిగా చేయాలని బాన్సువాడ నియోజకవర్గం బిజెపి నాయకులు శ్రీనివాస్ గార్గే ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బీబీ పాటిల్ ను భారీ మెజార్టీతో గెలిపించి మోడీకి బహుమానంగా అందించాల్సిన అవసరం ఉందని వివరించారు.
మద్దతుగా రుద్రూర్ మండల కేంద్రంలో బాన్సువాడ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ గార్గే ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కమలం పువ్వు గుర్తుకే తమ ఓటు నరేంద్ర మోడీ ని మూడోసారి ప్రధాన మంత్రిగా చూడాల్సిన అవసరం ఉందని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు హరికృష్ణ బీజేవైఎం గణేష్ ప్రశాంత్ గౌడ్ పార్వతి మురళి దీపక్ యాదవ్ కటికే రాజా రామ్ బిజెపి సీనియర్ నాయకలు అర్సపల్లి సాయి రెడ్డి , ముత్యాల సాయి బాబా, డాకయ్య , చీకట్ల రాజు నాంపల్లి శ్యామ్ రాజాసింగ్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





