బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి భర్త ప్రముఖ రాజకీయ నేత బుద్దె రాజేశ్వర్ గత 15 రోజుల క్రితం హఠాస్మరణం చెందారు.సమాచారం తెలిసిన బోధన్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు గురువారం సాలూరలోని ఎంపీపీ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సంధర్బంగ బుద్దె రాజేశ్వర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జర్నలిస్టులతో ఎంతో అవి నా బావ సంబంధాలు ఉండేవని ఆ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇటువంటి ప్రజా నాయకుడిని కోల్పోవడం ప్రజలకే కాకుండా జర్నలిస్టులకు తీరని లోటు అని జర్నలిస్టులు వ్యక్తం చేశారు. జర్నలిస్టులు గడ్డం గంగులు, వినాయక్ రాజ్,లింబూరి లక్ష్మణ్, ఉమాకాంత్, రమేష్, అఫ్రౌజ్, గ్రామస్థులు బొర్ర గంగారాం, అల్లె రమేష్ ,బుద్దె లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

