Monday, February 16, 2026

అంత్యక్రియలకు తేళ్ల రవి అన్న యువసేన ఆర్థిక సాయం

ఆపదలో ఉన్నవారికి ఆపన్నస్తం అందిస్తూ కష్టాల్లో ఉన్నవారికి మేమున్నామంటూ మనోధైర్యం నింపుతూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. తేళ్ల రవి అన్న యువసేన ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలోని ప్రజలకు ఎంతోమందికి తమ వంతు సహాయంగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు.
కోటగిరి మండలకేంద్రంలోని తోటిదుల గల్లికి చెందిన సున్నం పురుషోత్తం తల్లి బుధవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మృతి చెందింది.విషయం తెలుసుకున్న తేళ్ల రవిఅన్న యువసేన నిర్వాహకులు తెల్ల రవికుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.అనంతరం ఆమె అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కొంత నగదును అందజేశారు.ఈ పరామర్శలో గ్రామ పెద్దలు భీమా సాయిరెడ్డి,కప్ప సంతోష్,దామరంచ హన్మండ్లు,వన్నె శివరాం,సున్నపు భరత్,యువసేన నిర్వాహకులు కప్ప సంతోష్,తెల్ల చిన్నఅరవింద్,కోయిగుర్ శ్రీకాంత్,తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular