Monday, February 16, 2026

కార్మికుల అంత్యక్రియలకు కరుణించని నిజాంబాద్ కార్పొరేషన్

నిజాంబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మికులు మృతి చెందిన కార్మికుల అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేయకపోవడం బాధాకరం.
కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయంలో దాశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులు చనిపోయినప్పుడు కనీసం అంత్యక్రియల ఖర్చులు చెల్లించకుండా పాలకవర్గం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ యూనియన్ గౌరవాధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ 2014లో అప్పటి మున్సిపల్ డైరెక్టర్ నుండి కార్మికులకు చనిపోయిన వారికి అంత్యక్రియల ఖర్చులకోసం పదివేల రూపాయలు చెల్లించాలని ఆదేశించినప్పటికీ అమలు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. 2016 జూలైలో మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుండి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు చనిపోయిన వారికి అంత్యక్రియల ఖర్చులు 20000 చెల్లించాలని సర్కులర్ జారీ చేసి ఆదేశించినప్పటికీ జిల్లాలో వాటిని అమలు జరపటానికి మున్సిపల్ అధికారులు కానీ పాలకవర్గం కానీ చొరవ చూపకపోవడంతో అనేకమంది కార్మికులు అంత్యక్రియ ఖర్చులను కూడా నోచుకోలేకపోతున్నారు.ఇది సరైనది కాదని ఆయన ఆరోపించారు. అంత్యక్రియల ఖర్చులు చెల్లించాలని గతంలో అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ అమలు జరుపుతామని హామీ ఇవ్వడం తప్ప ఇవ్వటం లేదు. ఇటీవల ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో మున్సిపల్ కార్మికులు అధికారులు చందాల రూపంలో జమ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా బాధ్యతారహితమని వెంటనే చనిపోయిన కార్మికులందరికీ నిబంధనల మేరకు అంత్యక్రియలు ఖర్చులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ కార్యదర్శి భూపతి పాల్గొని వినతి పత్రం అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular