జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని పోతంగల్ మండలం
హెగ్డోలీ గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద కొనసాగిస్తున్న శివనామ సప్తహ కార్యక్రమంలో బిజెపి నాయకులు పలువురు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు దైవభక్తిని పెంపొందించుకుంటే సత్ప్రవర్తన సాధ్యమవుతుందని, ఇలాంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుపుకోవడం వల్ల గ్రామస్తులలో ఐకమత్యం పెంపొందుతుందని ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గార్గే తన ఆశ భావాన్ని వ్యక్తం చేశారు. గ్రామం పాడిపంటలతో విలసిల్లాలని విలసిల్లాలని ఆయన భగవంతున్ని కోరుకున్నారు. గ్రామస్తులు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భక్తితోనే ముక్తి కలుగుతుందని గ్రామాల్లో భక్తి భావన ను పెంచుకుంటే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందన్నారు.
