Monday, February 16, 2026

కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసి తీరుతుంది

కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అమలు చేశారు. ఇంకా కొన్ని హామీలను నెరవేర్చాల్సి ఉందని ఎన్నికల కోడ్ అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆగస్టు 15 లోపు రైతుల పంట రుణాలు మాఫీ చేసి తీరుతామని, పదేపదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టు వేసుకుని చెప్పడాన్ని రైతులు ఆలోచించి తమ భవిష్యత్తును ఎంపిక చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వం రుణాలు మాఫీ అని కాలం వెళ్లదీసి నాలుగేళ్ల పాటు సాగదీయడంతో రైతులు తీసుకున్న రుణం కన్నా వడ్డీ ఎక్కువ రైతులకు భారంగా మారిందన్నారు. అలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఆగస్టు 15 ఒక్కో రైతుకి రెండు లక్షల లోపు రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తామని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్ని మండల్లో వివిదగ్రామల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు లతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ ని అత్యదిక మేజార్టీతో గేలిపించాలని కోరిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరావు మరియు మాజీ శాసనసభ్యులు బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, వర్ని మండల పార్టీ అధ్యక్షులు సురేష్ బాబా, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎలమంచిలి శ్రీనివాసరావు, తాజా మాజీ సర్పంచ్ బుజ్జి, ఎంపీపీ మేక శ్రీ లక్ష్మీ వీర్రాజు, ప్రసాద్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular