Monday, February 16, 2026

కారేగామ్ లో బిజెపి ఇంటింటి ప్రచారం

భారతదేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న బిజెపి పార్టీ, ప్రధాని మోదీ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ బిజెపి అభ్యర్థి బి బి పాటీల్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బిజెపి నాయకులు గురువారం ఇంటింటా ప్రచారం చేశారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని పోతంగల్ మండలం కారేగాం గ్రామంలో కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ఇప్పటివరకు బిజెపి ప్రభుత్వం దేశాన్ని చేసిన సేవలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని ఓటర్లకు వివరించారు. కరోనా కష్టకాలంలో ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఆదుకొందాన్ని వివరించారు. రేషన్ షాపుల్లో పేదలకు అందిస్తున్న బియ్యాన్ని ఉచితంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని, మరో ఐదేళ్లపాటు బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని ఇప్పటికే ప్రధానమంత్రి ప్రకటన చేసి ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి గెలుపొందిందని, మరోసారి ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని, దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని వివరించారు. టిఆర్ఎస్ పార్టీకి పదేళ్లు ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే కుటుంబ పాలనను రాష్ట్రంలో ప్రజలపై రుద్దారని, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని బిజెపి కార్యకర్తలు గ్రామస్తులకు వివరించారు. మన దేశ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం సైతం బిజెపి పార్టీ నిర్మించింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మళ్లీ హిందువులకు దేశంలో ఇబ్బందులు ఎదురవుతాయని ప్రజలు అన్ని విషయాలను ఆలోచన చేసి బిజెపికి ఓటు వేస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సూధం అశోక్, మడెప్ప కపిల్, నాగనాథ్ పటేల్, పరుచూరి సందీప్, అటకాలే గజానన్ పటేల్, హంగర్ గా మహారాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular