పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయం సమీపిస్తుండటంతో జుక్కల్ ఎమ్మెల్యే ఉదయం నుండి రాత్రి వరకు గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ ఓట్ల ఆదిత్యం సాధించి తీరుతామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గెలుపొందిన నాటినుండి నేటి వరకు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల్లో తాను ఒకరిని అనే విధానంలో ముందుకు వెళ్లడంతో ఆయన పనితీరుకు ఇతర పార్టీలో చెందిన ఎంతోమంది ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో మరియు తడి హిప్పర్గ, లింబూరు,వాడి గ్రామాలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఎన్నికల ప్రచారం చేపట్టారు.మద్నూర్ మండలం కేంద్రంలో గత అసెంబ్లీ ఎన్నికలలో బి ఎస్ పి పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన ఏకాంబేకర్ ప్రజ్ఞా కుమార్ మరియు వారితో పాటు మహిళలు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.





