ఈనెల 11న కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జన జాతర సభ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ తెలిపారు. జన జాతర సభకు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 11 న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జన జాతర సభ ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి కేరళ ఎంపీ రాజ్ మోహన్ ఉన్నితన్ సభా ప్రాంగణము పరిశీలన చేశారు.
ఇందిరా గాంధీ కి ప్రతిరూపమైన ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారానికి మొదటి సారి కామారెడ్డికి రావడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు.
11వ తేదీన ప్రియాంక గాంధీ సభను
కనివిని ఎరుగని రీతిలో విజయ వంతం చేద్దాం అని పిలుపునిచ్చారు.
తెలంగాణలో ఎలాగైతే అధికారం లోకి వచ్చామో కేంద్రం లోకూడా అధికారం
లోకి రాబోతున్నం అన్నారు.
తిరిగి ఇంద్రమ్మ రాజ్యం రాబోతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు.
10 సంవత్సరాల్లో దేశ ప్రభుత్వ రంగ సంపదను అమ్మేశారు.
ప్రజలు కష్టాల పాలు ఆత్మహత్యల పాలు అయ్యారు. అదాని అంబానీ ప్రపంచ కుబేరులయ్యారు.

ఈ నెల 11 న ఉదయం 9:30 గం.లకు కామారెడ్డిలో జరిగే సభకు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు.
ఈ సభకు సుమారు 60 వేల నుంచి లక్ష మంది ప్రజలు వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలి విస్తోంది కేరళ ఎంపీ రాజమోహన్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయం.
సౌత్ ఇండియాలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలవబోతున్నాం.
ప్రధాని మోడీకి గెలుస్తామో లేదోనన్న భయం పట్టుకుంది.
కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది.
