మోస్రా రామాలయాన్ని జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు ఓరెత్తించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ ఆదిక్యంతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి కోరారు. గతంలో ఎంపీగా ఉన్న సందర్భంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టారని వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అధిక స్థానాల్లో గెలుపొందబోతుందని, భవిష్యత్ ప్రధానిగా రాహుల్ గాంధీ పదవి ప్రమాణం చేయనున్నట్లు ఏనుగు జ్వరం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన పోరాడడం వారి అభివృద్ధి కోసమే 60 ఏళ్ల పాటు దేశంలో ఇందిరా గాంధీ కుటుంబం తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, నాయకులు నేమాని వీర్రాజు, బుజ్జి, ఎలమంచిలి శ్రీనివాసరావు, ఆయనతోపాటు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు.




