Tuesday, February 17, 2026

బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మోసం చేశారని మరోసారి ప్రజలు వారి మోసాలకు మోసపోవద్దని పార్లమెంటు ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గఅభ్యర్థి గాలి అనీల్ కుమార్ కి మద్దతుగా ఈరోజు కోటగిరి, పోతంగల్ మండలాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించి, పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించిన మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి.పోతంగల్ మండలం కల్లూరు, జల్లాపల్లి అబాది, జల్లా పల్లి ఫారం. పోతంగల్ మండల కేంద్రం మరియు కోటగిరి మండలం లింగాపూర్, శ్రీనివాస కాలనీ, కోటగిరి మండల కేంద్రం, ఎతోండ లలో నిర్వహించిన ఈ ఎన్నికల ప్రచారాలు, పార్టీ సమావేశాలలో పాల్గొన్న నాయకులు పోచారం సురేందర్రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు.కేసీఆర్ నాయకత్వంలోని గత బిఆర్ యస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేసింది.
కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు.ఈ మోసాన్ని ప్రజలకు వివరించాలి. బిఆర్ యస్ పార్టీ అభ్యర్థులు ఎంపీలుగా గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగివచ్చి ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ప్రజలకు తెలియజేయాలి.అందరం కలిసి మన పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ ని మంచి మెజారిటీతో గెలిపించాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular