పదేళ్లపాటు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన పాటిల్ బిజినెస్ పాటీల్ గా వ్యవహరించారని ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనను ఓటమిపాలు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలోని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నివాసంలో ప్రెస్ మీట్ గురువారం ఏర్పాటు చేశారు.
బీజేపీ పార్టీకి బిఆర్ఎస్ బీటీమ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను జైలుకు పంపకుండా బీజేపీతో బిఆర్ఎస్ దోస్తీ
తీహార్ జైల్లో ఉన్న మాజీ సీఎం కూతురు కవితను బెయిల్ పై తీసుకురావడానికి బిఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి మద్దతుగా నిలుస్తుంది.
అందుకే 17 స్థానాల్లో 11 మంది బిఆర్ఎస్ పార్టీనీ వీడిన వ్యక్తులు ప్రస్తుతం బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. గ్రామాలలో బిఆర్ఎస్ నాయకులు బీజేపీ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
జహీరాబాద్ లో కాంగ్రెస్ కు ఓటు వేసి సురేష్ శెట్కార్ ను గెలిపించాలి.
దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి.
బిజెపి కోసం బిఆర్ఎస్ పార్టీ పని చేస్తుంది.బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థులు విజయం కోసం టిఆర్ఎస్ పార్టీ నాయకులు పనిచేస్తున్నారని ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. గురువారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కెసిఆర్ ను కాపాడేందుకు టిఆర్ఎస్ నాయకులు బిజెపి నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.ఈ రెండు పార్టీలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బిజినెస్ పాటిల్ పది సంవత్సరాల నుండి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు చేసింది ఏం లేదన్నారు.50 కోట్లు నిధులు వెనక్కి పంపించిన ఘనత బీబీ పాటిల్ కు దక్కిందన్నారు.
ఎంపీ నిధులు వెనుకకు పంపారు
RELATED ARTICLES
