ఉపాధి హామీ పనుల్లో మేము సైతం అంటూ కాంగ్రెస్ నాయకులు వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. పోతంగల్ మండలం కారేగావ్ గ్రామ చెరువులో కొనసాగుతున్న ఉపాధి పనులను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నాగనాథ్ పటేల్, కాంగ్రెస్ కార్యకర్తలు పనులను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలకు చేస్తున్న శ్రమకు తగ్గ ఫలితం అందించే విధంగా చూస్తామని కూలీలకు హామీ ఇచ్చారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందితే ఉపాధి హామీ కూలీల కష్టాలను తీరుస్తామని వివరించారు. ఉపాధి హామీ పథకాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుందని, రాహుల్ గాంధీ ఇప్పటికే ఐదు గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు శంకర్, మైసూరా రెడ్డి, శ్రీను, నీలకంఠ పటేల్, గంగాధర్, సాయిలు మరియు సంజీవ్ పటేల్ పాల్గొన్నారు.




