Tuesday, February 17, 2026

ఉపాధి కూలీలకు శ్రమకు తగ్గ కూలి చెల్లించాలి

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని పోతంగల్, కోటగిరి మండలాల్లో పలు ఉపాధి హామీ పనులు కొనసాగుతున్న ప్రదేశానికి వెళ్లి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలకు శ్రమకు తగ్గ వేతనము సౌకర్యాలు చెల్లించాలని ఉపాధి హామీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయ గౌడ్ తో ఫోన్లో మాట్లాడారు.

కారేగాం గ్రామస్తులను అన్ని రకాలుగా ఆదుకుంటాం

పోతంగల్ మండలంలోని కారేగాం చెరువులో చేపడుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. కూలీలకు శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుందా, మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. తాను అధికారులతో మాట్లాడడంతో తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామంలోని పేదలందరికీ ఇందిర మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది గ్రామస్తులు పెన్షన్లు రావడంలేదని ఆయన దృష్టి తీసుకువచ్చారు. ఎన్నికల కోడ్ అనంతరం వారందరికీ పెన్షన్ ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు గ్యారంటీ పథకాలు అమలు చేసిందని, కొన్ని సంక్షేమ పథకాలు అమలు మిగిలి ఉన్నాయని వాటిని కూడా ఎన్నికల అనంతరం అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఆగస్టు 15 రైతుల పంట రుణాలను ముఖ్యమంత్రి మాఫీ తీరుతారని మీరందరూ ఓపికతో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఏనుగు రవీందర్ రెడ్డి కోరారు. గతంలో బిజెపి పార్టీ ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చినారు ఎవరికైనా 15 లక్షలు రూపాయలు వచ్చినాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందని. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్న్ గెలిపించాలని, ఈ గ్రామం నుండి మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే రాబోయే రోజుల్లో గ్రామానికి సంబంధించిన అన్ని సమస్యలను తాను పరిష్కరిస్తానని ఎవరికైనా ఏ ఆపద వచ్చిన తన సమాచారం ఇస్తే తాను ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని ఉపాధి కూలీలకు ఏనుగు రవీందర్ రెడ్డి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే ఉపాధి కూలీలకు కనీస కూలి రోజుకు 400 రూపాయలు చెల్లించేందుకు ఏర్పాట్లు రాహుల్ గాంధీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల శంకర్, కాంగ్రెస్ నాయకులు మిస్సే నాగనాథ్ పటేల్, భీమా సాయి రెడ్డి, బాబీ సెట్, గిరిజన రాష్ట్ర నాయకులు ప్రతాప్ సింగ్, శ్రీను, రాజేష్, సురేందర్, బబ్లు, సాయిలు, రాజు, మైసూరా రెడ్డి, గంగాధర్, ఉత్తం, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

కూలీలకు పండ్లు పంపిణీ

ఉపాధి హామీ పనులు చేపడుతున్న కూలీలకు కార్యక్రమం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగనాథ్ పటేల్ పండ్లు పంపిణీ చేశారు, ఉపాధి కూలీలకు ఏ ఇబ్బంది వచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లి కూలీల సమస్యలు పరిష్కరిస్తానన్నారు. గ్రామంలోని నిరుపేదలకు ఇందిరా ఇళ్ళు మంజూరు చేయించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కూలీల సమస్యలు తెలుసుకోవడంతోపాటు తాను కూడా పనుల్లో నిమగ్నమై కూలీల కష్టసుఖాలను తెలుసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular