జన జాతర బహిరంగ సభకు ఆల్ ఇండియా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోనీ కామారెడ్డిలో రేపు అనగా (11-05-2024) రోజున జరగబోయే జన జాతర సభకు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న శ్రీమతి ప్రియాంక గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. శుక్రవారం సన్నాక సమావేశ స్థల పరిశీలన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఏర్పాటు చేసిన సమావేశంలోటిపిసిసి ప్రధాన కార్యదర్శి మరియు స్టేషన్ ఘనపూర్ ఇన్చార్జి సింగాపూరం ఇందిరా మరియు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శేట్కర్ , ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, జహీరాబాద్ పరిధిలోని శాసనసభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
