జగత్ జ్యోతి మాత్మ బసవేశ్వరుని 891 వ జయంతినీ ఘనంగా నిర్వహించిన వీరశైవ సమాజ్ ప్రముఖులు

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వీరశైవ జంగమ లింగాయత్ సమాజ్ వారి ఆధ్వర్యంలో జగత్ జ్యోతి మహాత్మా బసవేశ్వరుని 891 వ జయంతి సందర్భంగా బస్వేశ్వర చిత్రపటానికి పూజలు మంత్రపుష్పాంజలి తో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహాత్మ బసవేశ్వర 12వ శతాబ్దానికి చెందిన వారని పుట్టుకతో బ్రాహ్మణుడై నాటి సమాజంలో ఉన్న వర్ణ వ్యవస్థలకు చలించి వీరశైవ ధర్మాన్ని స్వీకరించి, అంటరానితనాన్ని, బాల్యవివాహాలనీ రూపుమాపుతూ సమ సమాజ స్థాపన, సమన్యాయంకై నాంది పలికాడని పలికాడనీ, అందులో భాగంగా నేటి పార్లమెంట్ గా పిలువబడే అనుభవ మండపాన్ని 12వ శతాబ్దంలోనే ఏర్పాటు చేశాడని, తదితర విషయాలను తను ఆచరిస్తూ ప్రజలను ఆచరింప చేస్తూ చైతన్యవంతులను చేశాడనీ ప్రముఖులు తెలిపారు.

ఈ సందర్భంగా సమాజం ప్రముఖులు వెంకటేశ్వరరావు దేశాయ్, శ్యామ్ రావు, శివకుమార్ అప్ప, శివరాజ్ పటేల్, లక్ష్మణ్ పటేల్, నర్సింగ్ అప్ప, గంగారాం, దిగంబరావ్, హనుమంతరావు, కర్నే శంకర్, మాధవరావు, విట్టలప్ప, పురాణే దిలీప్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
