Tuesday, February 17, 2026

దేశభద్రత బిజెపితోనే సాధ్యం

ద్రోణ ఢిల్లీ బ్యూరో

ఒకప్పుడు ఎక్కడ ఉగ్రదాడి జరుగుతుందో అని భయంతో బతికేవాళ్ళం. కనీసం ఇండియన్ ఆర్మీకి కూడా సరైన సదుపాయాలు ఉండేవి కావు, వాళ్ళపైనే రాళ్ళతో దాడులు చేసినా ఏమీ చేయలేని పరిస్తితి. కానీ మోడీ ప్రభుత్వం వచ్చాక అంతా మారింది. సైనికులకు పూర్తి అధికారాలిచ్చారు. ఉగ్రదాడులు, రాళ్ళదాడులు చేయడానికి జంకుతున్నారు.
ఒకప్పుడు యుద్ధ సామాగ్రి బయటి దేశాలనుండి కొనుక్కోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు మనదేశం నుండే చాలా దేశాలకు పంపిస్తున్నాం.
మేక్ ఇన్ ఇండియా లాంటి అద్భుతమైన పథకాల వల్ల మన దేశం పెద్ద ఆర్థికవ్యవస్థగా మారింది, యువతకు ఉద్యోగావకాశాలు పెరిగాయి. ఫోన్ పే లాంటి ఆప్ ల ద్వారా డిజిటల్ కరెన్సీని పెంచారు.
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం వచ్చినపుడు అసలు బ్రతికుంటే చాలు అని ఆస్తులు వదిలేసి విమానం రెక్కలకు వేలాడుతూ పారిపోయిన దృశ్యాలు రెండేళ్ల కింద చూసాం. ప్రశాంత వాతావరణం అంత ముఖ్యం.
దేశంలో ప్రశాంతమైన వాతావరణం కోసం బీజేపీకి ఓటు వేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular