జుక్కల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బసవేశ్వర మహారాజ్ జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పలు చోట్ల
పాల్గొన్నారు. సమాజపు కోసం చేసిన కృషిని గుర్తు చేశారు.
బిచ్కుంద మండల కేంద్రంలో సామాజికవేత్త మహాత్మా బసవేశ్వర మహారాజ్ జయంతి ఉత్సవాలలో పాల్గొని బసవేశ్వర్ మహారాజ్ పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఘన నివాళులు అర్పించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బసవేశ్వర మహారాజ్ కారణజన్ములనీ, సమాజం కోసం ఆయన చేసిన సేవలను డబ్బుతో వెలకట్టలేమని, ఆనాటి సమాజంలో ఉన్న దురాచారాలకు చరమగీతం పాడాలని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు సమాజం కోసం ఏదో ఒక మంచి పని చేస్తే 10 కాలాలపాటు చిరస్థాయిగా ప్రజల్లో స్థానం సంపాదించే భాగ్యం కలుగుతుందన్నారు. ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కుల రహిత సమాజం కోసం కృషి చేసిన వ్యక్తి బసవేశ్వరుడని కొనియాడారు..
దానం, ధర్మం, సమ సమాజ స్థాపన కోసం పాటుపడిన అభ్యుధయవాది అని ఆయన గొప్పతనాన్ని వివరించారు.
ఆయన సూచించిన మార్గాలు సదా ఆచరణీయమని అందరూ వాటిని అనుసరించడమే గాక భావితరాలకు ఆయన చరిత్ర
సమాజం కోసం ఆయన చేసిన కృషిని తెలియజేయాలన్నారు.

అనంతరం మండల కేంద్రంలో బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్నారు.
మరియు మండల కేంద్రంలో డెంటల్ హాస్పిటల్ ని ప్రారంభించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో ఎమ్మెల్యే నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు, కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందడమే లక్ష్యంగా ఆయన రాజకీయ వ్యవహారచన చేస్తూ ఉన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వందలాదిమంది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
