Tuesday, February 17, 2026

ఎంపీలకు భలే సౌకర్యాలు

ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్రం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. నెలకు రూ.లక్ష (అన్ని అలవెన్స్‌లు) వేతనంగా చెల్లిస్తారు. పదవి అనంతరం రూ.50 వేల పింఛన్‌ సైతం వస్తుంది. ఇక వారికి ప లు రకాల నిధులు మంజూరు చేస్తారు.  ఏడాదిలో 34 సార్లు ఎంపీతో పాటు ఆయన భార్యకు ఉచిత విమాన ప్రయాణం కల్పిస్తారు. ఫస్ట్‌క్లాస్‌ ఏసీ కోచ్‌లో రైలు ప్రయాణం ఉచితం. రోడ్డు రవాణా అయితే కి.మీకు రూ.16 చొప్పున బిల్లు చెల్లిస్తారు. నియోజకవర్గం కార్యాలయ నిర్వహణ ఖర్చు నెలకు రూ.45 వేలు, పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొంటే రోజుకు రూ.2 వేలు అదనంగా చెల్లిస్తారు. ఫర్నిచర్‌, ఎలక్టాన్రిక్‌ వస్తువులు, ఇతర అవసరాల నిమిత్తం ప్రతి మూడు నెలలకు రూ.75 వేలు అందిస్తారు. 
● పాథాలాజికల్‌ లాబొరేటరీ సౌకర్యం, ఈసీజీ, దంత, కంటి, చర్మ ఆరోగ్య సేవలు ఉచితంగా పొందవచ్చు. దిల్లీలో నివాస వసతిని కల్పిస్తారు. తొలిసారి గెలిచిన వారికి రాష్ట్ర ప్రభుత్వ వసతిగృహాలను కేటాయిస్తారు. సీనియర్లకు వ్యక్తిగత బంగ్లాలను కేటాయిస్తారు. 50 వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వినియోగించుకోవచ్చు. మూడు టెలిఫోన్లను ఉపయోగించుకోవచ్చు. తనకు ఇష్టమైన చోట ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదిలో 50 వేల ఉచిత కాల్స్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా 3జీ ప్యాకేజీలో అదనంగా 1.50 లక్షల కాల్స్‌ మాట్లాడుకునే వీలుంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular