Tuesday, February 17, 2026

రేషన్ డీలర్ల హంగామాకోట్ల కుంభకోణం

ద్రోణ బోధన్ ప్రతినిధి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రేషన్ రేషన్ బియ్యం కుంభకోణం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసినదే కానీ దానిని పట్టించుకునే నాధుడు లేకపోవడం ఎక్కడ చూసినా పేదరిక ప్రజలకు రేషన్ బియ్యం అందించాలనే లక్ష్యంతో ప్రజలను రాజకీయ నాయకులను మభ్యపెడుతున్నారని అపోహలు వెళ్లడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరిలో రైస్ మిల్లర్లు పిడిఎఫ్ బియ్యం కొంటున్నారని నేపథ్యంలో ఉన్నారే కానీ రేషన్ కార్డులలో ఎంతమంది ఉన్నారు. ఎంతమంది లేరు అనే డేటా ఎవరి దగ్గర లేకపోవడం
డీలర్లకు పెద్ద ఎత్తున కుంభకోణం కానరాక పోవడం అనేది ఎంతవరకు దీనిపై ఎవ్వరూ కూడా ఏ అధికారి ఎంక్వైరీ చేయకపోవడం ఈ కుంభకోణాన్ని ఆపే నాధుడు లేకపోవడం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని కొన్ని ఏరియాలలో సన్న బియ్యం అని చెప్పుకుంటూ ఇంకా దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దేశమంతా రాజకీయ నాయకులు ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నామని వారి ప్రగల్బాలు చెప్పుకుంటున్నారు. 10 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన పప్పు బియ్యం కిరోసిన్ లాంటి ముడి సరుకులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రజలు డీలర్లని అడుగుతుంటే వారి దగ్గర సమాధానాలు లేకపోవడం రేషన్ కార్డులలో చనిపోయిన మృతుల పేర్లను తీసివేయకపోవడం కొత్త వారి పేర్లు ఇంతవరకు రాయకపోవడం. ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. డీలర్లను అడగగా మాకు ఆన్లైన్ సర్వీసులు బంద్ ఉన్నాయని లేదంటే ఇంకా మాకు ఆదేశాలు రాలేదని చెప్పుకోవడం జరుగుతుందని ప్రజలు వాపోతున్నారు. ఒక దగ్గర ఒక రేషన్ షాప్ లోనే పది క్వింటాలకు పైగా దుర్వినియోగం జరుగుతుందని తెలుస్తుంది. ఆర్డిఓ , ఎమ్మార్వో దీనిపై ఎందుకు చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నారో తెలియడం లేదు ఇలా జరుగుతున్న దేశంలో రాజకీయ నాయకులు వాళ్ల ఓట్ బ్యాంకులను మాత్రమే చూసుకుంటున్నారు.కానీ దేశానికి ఎంత ఖజానా దుర్వినియోగం జరుగుతుందో ఎవ్వరికి తెలియడం లేదు. ఏ అధికారి చూసిన వేరే వాటిపై దృష్టి పెట్టడమే కానీ ఇలాంటి వాటిపై దృష్టి పెట్టకుండా వదిలేయడం వల్ల ఎంత ప్రభుత్వానికి నష్టం జరుగుతుందో ఆలోచించాలని మోడీ ప్రభుత్వం ఎంపీ కోటా కింద మనిషికి నాలుగు కిలోలు అంటూ స్టేట్ గవర్నమెంట్ మనిషికి ఐదు కిలోలంటూ కరోనా వ్యవధిలో ఎన్నో బియ్యం రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందజేయడం జరిగింది. కానీ దానిని సరిగా ఎవరు సద్వినియోగం చేసుకున్నారు. చూసిన నాధుడే లేడు కొంతమంది ప్రజలు రేషన్ డీలర్ల పై గొడవలకు కూడా దిగుతున్నారు. సన్న బియ్యం ప్రభుత్వం ఇస్తున్న వీరు దొడ్డు బియ్యం తీసుకువచ్చి మాకు ఇస్తున్నారని వాపోతున్నారు. మాకు అవేబియ్యం ఇస్తున్నారని మేము ఎక్కడ నుంచి తేవాలని ఆఫీస్ లో కంప్లైంట్ చేయమని డీలర్లు ప్రజలకు చెపుతున్నారు. మరి కొన్నిచోట్ల పనికిరాని బియ్యం ఇస్తున్నారని తెలుపుతున్నారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని లేకుంటే ప్రజలు ఎదురు తిరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణం కాంగ్రెస్ హయాంలో జరగవద్దని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular