హైదరాబాద్ బ్యూరో
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ ఆటోడ్రైవర్ తాజాగా దారుణానికి పాల్పడ్డాడు. స్కూల్లో చదువుతున్న అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. రోజూ ఆ అమ్మాయిని ఆటోడ్రైవర్ స్కూల్‌లో దింపుతాడు. అయితే మార్గమధ్యంలో ఒంటరిగా ఉన్న ఆ అమ్మాయిపై అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. లైంగికంగా వేధించాడు. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అయింది. ఆటోడ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, పోక్సో కేసు నమోదు చేశారు.
