మాజీ శాసనసభ్యులు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కురుమ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు గ్రామ కుర్మ సంగం సభ్యులకు ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కట్టారు. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారికి ఏ ఆపద వచ్చిన నేను అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోటగిరి ఎంపీటీసీ కొట్ట మనోహర్, నాయకులు సలీం, కురుమ సంఘం జిల్లా నాయకులు వీరుగొండ, బర్ల మధు, బీమా సాయి రెడ్డి, కోటగిరి మండలం పార్టీ అధ్యక్షులు షాహిద్ తో పాటు పలువురు పాల్గొన్నారు.


