Tuesday, February 17, 2026

కారేగాం లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పొతంగల్ మండలం కారేగాం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎంతో బలోపేతమైందని, మా గ్రామంలోని ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా ఆయన అండగా ఉంటామని చెప్పడమే కాకుండా ఇప్పటికే ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగనాథ పటేల్ గ్రామస్తులకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే గ్రామంలోని పేదల సమస్యలు అన్నిటిని పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న గ్యారంటీ పథకాల గురించి ఓటర్లకు వివరించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరో ఐదు గ్యారంటీ పథకాలను రాహుల్ గాంధీ అమలు చేయనున్నారని వివరించారు. గ్రామస్తులు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీను, శంకర్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular