Tuesday, February 17, 2026

ఉపాధి హామీ కూలీలతో ప్రచారం కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్

2006 సంవత్సరంలో పేదవారికి ఉపాధి కల్పించేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్, కోఆర్డినేటర్ కాసుల బాలరాజు అన్నారు. జుక్కల్ మండలంలోని వజ్రకండి గ్రామ అడవి శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి వెళ్లి ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దినసరి కూలీ 400 రూపాయలకు పెంచుతామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయని, ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమములో సంజు పటేల్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular