Tuesday, February 17, 2026

జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి

జుక్కల్ అభివృద్ధిని నేను చేసి చూపెడతా ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు.

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్నూర్ మండలం పెద్ద ఎక్లార, కొడ్చిర, అవల్గావ్ గ్రామాలలో ప్రచార కార్యక్రమాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోటలక్ష్మీకాంతారావుఈసంద్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని దేశంలో మోడీ చేసింది ఏమీ లేదు అబద్దాల హామీలతో ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వడం జరిగింది.రానున్న ఐదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి , ఎంపీగా సురేష్ షెట్కార్, ఎమ్మెల్యేగా నేను, జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తాం అని చెప్పారు.రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశంలో ఎటువంటి ఘర్షణలు విద్వేషాలు లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారని,యువతకు ఉద్యోగాలు వస్తాయని, అన్ని రంగాల్లో దేశం పురోగమిస్తుందని తెలిపారు..
కావున ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి సురేష్ షెట్కార్ ని గెలిపించగలరని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular