పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ పట్టణం పరిధిలోని బీడీ వర్కర్స్ కాలనీ ( PSR కాలనీ), బాన్సువాడ రూరల్ మండలం తాడ్కోల్, దేశాయిపేట గ్రామాలలో జరిగిన ప్రచార సభలలో పాల్గొన్న మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి.




కేసీఆర్ నాయకత్వం లోని బిఆర్ యస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలైన రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరంటు, డబుల్ బెడ్ రూం ఇళ్ళు, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, ఆసరా పెన్షన్లు రూ.2000 కి పెంపు, కంటివెలుగు పథకాలు అమలు చేశాం. హాస్పిటల్ లు, రెసిడెన్షియల్ స్కూళ్ళు కట్టించాం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు అందించాం. ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశాం.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలైన రైతుబంధు ఎకరాకు రూ. 15,000 కు పెంపు, కౌలు రైతులకు ఎకరాకు రూ. 15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్,18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ. 2500, ఆసరా పెన్షన్ రూ. 4000, నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకంలో ఆడబిడ్డకు లక్షా పదహారు వేల రూపాయలతో పాటుగా తులం బంగారం, కాలేజీలకు వెళ్ళే విద్యార్ధినులకు స్కూటీలు,రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, 24 గంటల కరంటు.
ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. మోసం చేసిన వారికి ఓటు వేస్తే మోసానికి మద్దతు ఇచ్చినట్లే
మాట ఇచ్చి అమలు చేసిన వారికి ఓటు వేద్దామా, అమలు చేయకుండా మోసం చేసిన వారికి ఓటు వేద్దామా ?.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చి మోచేతికి బెల్లం పెడుతున్నారు.హామీల అమలుపై కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి, చెంపదెబ్బ కొట్టినట్లు సమాధానం చెప్పాలి.
వేల కోట్లతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను. ప్రతి గ్రామంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాను. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాను.ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గా పది సంవత్సరాలు ఉండి ఒక్క ఇల్లు కట్టించని ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గంలో 11,000 ఇండ్లు కట్టించిన నన్ను విమర్శిస్తున్నాడు.
నేను డబ్బుతో రాజకీయం చేయలేదు. పేదలకు సేవ చేస్తూ ఎదిగాను.పదేళ్ళు ఎంపీ గా పనిచేసి ఇప్పుడు బిజెపి అభ్యర్థిగా ఉన్న బిబి పాటిల్ ఏ పని చేయలేదు. అందుకే ఓటుతో బుద్ధి చెప్పాలి.అంతకు ముందు అయిదేళ్ళు ఎంపీ గా పనిచేసిన కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షెట్కార్ కూడా ఏం పని చేయలేదు.
ఏ పని చేయని వాళ్ళకు ఎందుకు ఓటు వెయ్యాలి.
బిఆర్ యస్ పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ బలహీన వర్గాల బిడ్డ.మే 13న జరిగే పోలింగ్ లో అందరు కారు గుర్తుపై ఓటు వేసి పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ ని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
