ఆరుగాలం కష్టించి పనిచేసే రైతులు పండించిన దాన్యం కొనుగోలు తూకాల్లో మోసం చేస్తే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు లో రైతులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే దృష్టి తీసుకువచ్చారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే అధికారుల ఆదేశించారు.
జుక్కల్ మండలంలోని ఖండేబల్లూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
తూకంలో మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక.
రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు.
మాయిశ్చర్ విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు.
కనీస మద్దతు ధర, తూకాల గురించి ఎమ్మెల్యే రైతులను అడిగి తెలుసుకున్నారు.
పలువురు రైతులు తాము తీసుకు వచ్చిన ధాన్యంలో తాలు పేరుతో ధాన్యం తగ్గిస్తున్నారని, మాయిశ్చర్ ప్రతి రోజూ చూడడం లేదని ఎమ్మెల్యే దృష్టి తీసుకువచ్చారు.
బస్తాకు నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నారని ప్రశ్నించిన వారిని బూతులు తిడుతున్నారని ఎమ్మేల్యే కి పిర్యాదు చేయగా.
వెంటనే ఐకెపి నిర్వాహకుడికి ఫోన్ చేసి ఈ విషయం గురించి అడగగా తాను నిర్లక్ష్యంగా సమాదానమివ్వడంతో.
రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అతనిని వెంటనే సస్పెండ్ చేసి రైతులను తరుగు పేరుతో మోసం చేయడమే గాక బూతులు తిట్టినందుకు గానూ కేసు నమోదు చేయాలని పై అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఐకెపి కేంద్రాలకు రైతులు తీసుకువచ్చే ధాన్యంలో తాలు పేరుతో తూకం తగ్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, వేసవి కాలం దృష్ట్యా తాగునీటి సౌకర్యంతో పాటు టెంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

