Tuesday, February 17, 2026

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలి

ద్రోణ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి

ప్రజలకు మట్టా దంపతులు పిలుపు

ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రామసహయం రఘురాం రెడ్డి ని రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ తో గెలిపించేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ కోరారు. పది సంవత్సరాలు దేశాన్ని పాలించిన బీజేపీ తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశ ప్రజల కష్టాలు తీరుతాయని ఆయన తెలిపారు.
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు BRS పార్టీకి బుద్ది చెప్పారని ఈ ఎన్నికల్లో బీజేపీని కూడా ఇంటికి సాగనంపుతారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని నెరవేర్చిందన్నారు. ఆగస్టు లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేసి రామసహయం రఘురాం రెడ్డి ని ఈవీయం నెంబర్ 3 పై ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular