ద్రోణ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి
May 12, 2024,
రేపు ఉ.11 గంటలకు ఓటు వేయనున్న కేసీఆర్
ఉమ్మడి మెదక్ జిల్లాలోని రాజకీయ ప్రముఖులు సోమవారం ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. సిద్దిపేట జిల్లా చింతమడకలో ఉదయం 11 గంటలకు మాజీ సీఎం కేసీఆర్ ఓటు వేయనున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మంత్రి దామోదర రాజనర్సింహ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సిద్దిపేట భరత్ నగర్‌లో ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఓటు వేయనున్నారు. అటు సంగారెడ్డి పట్టణంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఓటు వేయనున్నారు.
